మహదేవపూర్/కాళేశ్వరం, ఆగస్టు 15 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్‌కు(Medigadda barrage) గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరదలు తగ్గాయి. బుధవారం బరాజ్‌కు ఇన్‌ఫ్లో 2,21,410 క్యూసెక్కులు కాగా, గురువారం 1,40,310 క్యూసెక్కులకు తగ్గింది. బరాజ్‌లోని అన్ని గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వరద ప్రవాహం రివర్ బెడ్ నుంచి 90.60 మీటర్ల ఎత్తులో ఉంది. వరద తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉందని భారీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
కాళేశ్వరం వద్ద తగ్గిన గోదావరి
మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరికి(Godavari) ఇన్‌ఫ్లో 1.40 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇక్కడ 6.20 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తున్నది. వర్షాలు తగ్గడంతో ఎగువ మహారాష్ట్ర నుంచి వరదలు తగ్గాయని అధికారులు తెలిపారు. మరోవైపు అన్నారం బరాజ్‌కు 2,600 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. మానేరు వాగుతోపాటు చిన్నచిన్న కాల్వల ద్వారా వరదలొస్తున్నాయి. అయితే వచ్చిన నీటిని 66 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు.