హిమాయత్‌నగర్, మే 12 : పోక్సో కేసులో బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని పలు మహిళా సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వీ సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు జీ అనసూయ, ఎన్ జ్యోతి మాట్లాడుతూ నిందితుడు సాయి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారంటే కేసును నీరుగార్చడంలో భాగమేనని ఆరోపించారు. ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 17 ఏండ్ల బాలికపై హనీట్రాప్ అంటూ కేసు పెట్టడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. సమావేశంలో జీ ఝాన్సీ, ఎస్ వరలక్ష్మి, స్వరూప, లక్ష్మి, జీ భారతి, హేమలత,బీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని ఐద్వా అఖిల భా రత ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి డిమాండ్ చేశా రు. మంగళవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద నిరసన తెలిపారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పుణ్యవతి మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మారుడు భగీరథ్ ఓ బాలికపై అఘాయిత్యానికి ఒ డిగట్టడమే గాక బెదిరింపులతో కేసును సెటిల్ చే సుకొనేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణ మని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని నినాదాలిచ్చే బీజేపీ నేతలు.. మహి ళలపై అత్యాచారాల విషయంలో మాత్రం నేరస్తు లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు, జ్యోతి, ఆశాలత పాల్గొన్నారు.