ప్రయాణికుల రద్దీని బట్టి ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా చేశారు. ప్రయాణికుల నుంచి సంతకాల సేకరణ చేపట్టి నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందించారు. మహాలక్ష్మీ పథకంతో బస్సుల్లో రద్దీ పెరగడంతో ప్రయాణికులంతా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, రాజన్న, గంగామణి, కవిత, విజయ, వసంత, తస్రీన్ తదితరులు పాల్గొన్నారు.