హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి త్వరలో కొత్త పాలసీ తీసుకురానున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ది జర్నలిస్టు కో ఆపరేషన్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గురువారం జూబ్లీహిల్స్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిజంలో పని చేస్తున్న మహిళలు యజమానులుగా ఎదుగాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఉపయోగపడే కథనాలు వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, ది జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, కార్యదర్శి రవీంద్రబాబు, సంయుక్త కార్యదర్శి చల్లా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.