హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆ వింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
బుధవారం హైదరాబాద్‌లోని ఉమెన్‌సేఫ్టీ వింగ్ కార్యాలయంలో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 43 మంది ఇండక్షన్ ఐపీఎస్ బ్యాచ్‌కు తమ విభాగం పనితీరును వివరించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషిని వెల్లడించారు.