నిర్మల్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల ఓ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ డ్యూటీలకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులను జనానికి చేరువ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారంలో ఒక రోజు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పురుష కానిస్టేబుల్‌తో కలిసి పెట్రోకార్ డ్యూటీ చేయాలని మహిళా కానిస్టేబుళ్లను ఆదేశించారు.
ఇకపై ఎమర్జెన్సీ కాల్స్ కూడా మహిళా పోలీసులు అటెండ్ చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచే అమలు చేసినట్టు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఎక్స్ వేదికగా ఎస్పీ జానకీషర్మిలను అభినందిస్తూ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.