హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : మహిళా సాధికారత దిశగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించింది. ఔత్సాహిక మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఓపెన్‌కాస్ట్ గనుల్లో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్, బదిలీ వర్కర్‌గా పనిచేస్తున్న (35 ఏండ్లలోపు), 7వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులకు ఆపరేటర్లుగా అవకాశం కల్పిస్తారు. ఇలా అవకాశం కల్పించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి.