మంథని రూరల్, జూన్ 16: వానకాలంలోనూ ప్రజలకు నీటి కష్టాలు తప్పడంలేదు. ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లిలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో తాజా మాజీ సర్పంచ్ పోగుల సదానందం ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తాగునీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఏనాడు నీళ్లకోసం ఇక్కట్లు పడలేదని అన్నారు. వెంటనే స్పందించిన తాజా మాజీ సర్పంచ్ సదానందం సమస్యను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా.. నీటి సమస్య తీరేదాకా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.