జగిత్యాల నుంచి కడెం వరకు వెళ్లే బస్సులను తమ గ్రామం మీదుగా నడపాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం భూత్కుర్కు చెందిన మహిళలు ఆదివారం మున్యాల-భూత్కుర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని అన్ని మండలకేంద్రాల్లో సోమవారం మండల సమాఖ్యల ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సంఘాల్లో కొత్త సభ్యులను చేర్పించడం, రుణ బీమా, ప్రమాద బీమా, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు,డ్వాక్రా బజార్లు, బ్యాంకు రుణాలు, మహిళాశక్తి భవనాల నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు.