Peddapalli | 108 వాహనంలో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం
Peddapalli | పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా 108 వాహనంలోనే(108 Vehicle) ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం(Women Delivery) చేసి..తల్లి, బిడ్డను కాపాడారు.
పెద్దపల్లి : పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా 108 వాహనంలోనే(108 Vehicle) ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం(Women Delivery) చేసి..తల్లి, బిడ్డను కాపాడారు. ఈ సంఘటన పెద్దపల్లి(Peddapalli Dist) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండలం శాయంపేట గ్రామానికి చెందిన మైస సోనియా(24) పురిటి నొప్పులతో బాధపడుతూ రాత్రి 9గంటలకు మేడారం ప్రభుత్వ దవాఖానలో చేరింది.
అక్కడ డెలివరీ కాకపోవడంతో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. మేడారం నుంచి పెద్దపల్లి జిల్లా మాతా శిశు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్‌లో నొప్పులు అధికమయ్యాయి. వెంటనే 108 సిబ్బంది ఈఆర్సీపీ డాక్టర్ సూచన మేరకు అంబులెన్స్‌లోనే డెలివరీ చేశారు. సోనియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వీరిని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు దవాఖానకు తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. కాగా, 108 సిబ్బందికి సోనియా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

