మేడారంలో గ్యాంగ్‌రేప్‌పై మహిళా కమిషన్ విచారణ
మేడారం జాతరలో సామూహిక లైంగికదాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. ఆ ఘటనను విచారణకు సుమోటోగా స్వీకరించి విచారణకు ఓ కమిటీని ఏర్పాటుచేసింది.
- సుమోటోగా కేసు స్వీకరణ
ములుగు, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరలో సామూహిక లైంగికదాడి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. ఆ ఘటనను విచారణకు సుమోటోగా స్వీకరించి విచారణకు ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ అంశాన్ని అత్యంత తీవ్రమైనదిగా భావిస్తున్నట్టు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రాహత్కర్ పేర్కొన్నారు. ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్డప్ కమిటీకి అధ్యక్షత వహించనున్నారు.
సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించనున్నారు. అదనంగా ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించే ఒక న్యాయవాది ఈ కమిటీకి సహకరించనున్నారు. విచారణ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఘటన, గురిం చి, అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను సమీక్షించడం, విచారించి, వాస్తవాలను నిర్ధారించేందుకు కమిటీ ప్రయత్నించనున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలను సూచించడం వంటి బాధ్యతలను కూడా కమిటీకి అప్పగించారు. కమిటీ తన సిఫారసులను తదుపరి చర్యల కోసం జాతీయ మహిళా కమిషన్‌కు సమర్పిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

