కులకచర్ల, డిసెంబర్ 17 : రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలోనే ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన పాత్లావత్ భీమ్లానాయక్ (32) బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదరాబాద్కు వలసవచ్చాడు.
బుధవారం ఎన్నికలు ఉండటంతో అతడి భార్యను ఒక్కరోజు ముందే కులకచర్ల మండలం బండమీదితండాకు బంధువుల వెంట పంపించాడు. మంగళవారం అతడు కూడా ఓటు వేసేందుకు బైక్పై తన గ్రామానికి వెళుతుండగా, శేరిలింగంపల్లి పరిధిలో అతడి బైక్ను టిప్పర్ ఢీకొట్టడంతో భీమ్లానాయక్ అక్కడికక్కడే మృతి చెండాడు. బుధవారం మృతుడి భార్య కుటుంబ సభ్యుల సహాయంతో పుట్టెడు దుఃఖంతో ఓటు వేసింది.