బిజినేపల్లి, సెప్టెంబర్ 16: కడుపుతీపి ని మరిచిపోయి తన పిల్లలపైనే కర్కశత్వం చూపింది ఓ కన్నతల్లి. అభం శు భం తెలియని ఆ పసికూనలను అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ తల్లి.. నలుగురు చిన్నారులను కాలువలో విసిరేసి ప్రాణాలను బలిగొన్నది. ఈ హృదయవిదారక ఘటన శనివారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరులో చోటుచేసుకున్నది.
గ్రామానికి చెందిన శరబంద, వసూరం తండాకు చెందిన లలిత 8 ఏండ్ల కిందట ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి మహాలక్ష్మి(5), స్వా తిక (4), మంజుల(3), మారుకొండ య్య (7నెలలు) ఉన్నారు. భార్యాభర్తలు గొడవపడటంతో లలిత శనివారం బిజినేపల్లి పీఎస్లో భర్తపై ఫిర్యాదు చేసింది. మళ్లీ వస్తానని బయటకు వచ్చి మండల కేం ద్రం సమీపంలోని ఎంజీకేఎల్ఐ కాలువలో నలుగురు పిల్లలను విసిరేసింది. స్థానికులు ముగ్గురు చిన్నారులను బయటకు తీయగా.. వారు అప్పటికే మృతిచెందారు. బాలుడి ఆచూకీ దొరకలేదు.