Siddipet | ఆస్తి కోసం సొంత అక్క కాపురంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించింది ఓ చెల్లెలు.. అంతటితో ఆగకుండా అక్కను, అడ్డొచ్చిన తల్లిని చంపేస్తానని బెదిరింపులకు దిగింది. గతంలో తండ్రిని హత్య చేసేందుకు కూడా యత్నించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో ఈ ఘటన జరిగింది.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన వల్లబోజు ఈశ్వరయ్య, భాగ్యమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో రెండో కూతురు జ్యోతి 15 ఏళ్ల క్రితం సమీప బంధువైన సందీప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఏడేళ్ల క్రితం ఇంటికొచ్చి ఆస్తి ఇవ్వాలంటూ కన్న తండ్రి ఈశ్వరయ్యను కోరింది. ఈ క్రమంలో తండ్రిపైనే దాడి చేసింది. ఈ ఘటనలో తండ్రి తలకు బలమైన గాయమైనప్పటికీ కూతురే కదా అని కేసు పెట్టకుండా వదిలేశాడు. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన ఈశ్వరయ్య 2024లో చనిపోయాడు.
ఆస్తి కోసం అక్కను, తల్లిని చంపేస్తానని బెదిరించిన చెల్లెలు
అక్క ఇంట్లో విబేధాలు రావడానికి వేరే వ్యక్తితో సంబంధం అంటగట్టేందుకు ప్రయత్నం
గతంలోనూ తండ్రిపై హత్యాయత్నం
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన వలబోజు ఈశ్వరయ్య, భాగ్యమ్మ దంపతులకు నలుగురు సంతానం
15 ఏళ్ల క్రితం సమీప… pic.twitter.com/7OgjofBzvX
— Telugu Scribe (@TeluguScribe) October 19, 2025
తండ్రి చనిపోయిన తర్వాత అమ్మ, అక్కను ఆస్తి కోసం జ్యోతి వేధింపులకు గురిచేసింది. ఈ క్రమంలో అక్క కాపురంలో విబేధాలు రావాలని సాయి అనే పరాయి వ్యక్తికి నెంబర్ ఇచ్చి అసభ్యకరమైన మెసేజులు చేయించించింది. సాయిని పట్టుకొని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తల్లికి, అక్కకు కాల్ చేసి, గతంలో తండ్రిపై దాడి చేసి చంపినట్లు చంపుతానంటూ బెదిరింపులకు గురి చేసింది. తనకు ఎక్కువ ఆస్తి రావాలని కోర్టులో కేసు కూడా వేసింది. ఈ క్రమంలో అక్క మహిళా కమిషన్ను ఆశ్రయించింది. చెల్లె నుంచి తమ కుటుంబాన్ని రక్షించాలని కోరింది.