రాత్రి కరెంట్‌కు మహిళా రైతు బలి
రాత్రి కరెంట్‌కు ఓ మహిళా కౌలు రైతు బలైంది. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చే కరెంట్ కోసం ముందస్తుగా విద్యుత్తు వైర్లు, పైపులను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు వదిలింది.
- పొలంలో వైర్లు సరిచేస్తుండగా విద్యుత్తు షాక్
- వరంగల్ జిల్లా గుడితండాలో విషాదం
నర్సంపేట, అక్టోబర్ 25 : రాత్రి కరెంట్‌కు ఓ మహిళా కౌలు రైతు బలైంది. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చే కరెంట్ కోసం ముందస్తుగా విద్యుత్తు వైర్లు, పైపులను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు వదిలింది. స్థానికుల కథనం మేరకు.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం నాజీతండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుడితండాకు చెందిన భూక్యా మంగమ్మ (38), శ్రీనివాస్ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.
వీరు ఇటీవల నాజీతండా శివారులో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఎకరంలో వరి, మిగిలిన ఎకరన్నరలో పత్తి, మిర్చి సాగు చేశారు. వరిపొలానికి నీరు పెట్టేందుకు సమీపంలోని ఓ రైతుకు చెందిన బోరును అద్దెకు తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం మంగమ్మ పొలం వద్దకు వెళ్లి మోటర్పైపులతోపాటు కరెంటు వైర్‌ను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె విద్యుత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dating App Fraud | ఒంటరి మగాళ్లే టార్గెట్.. గే అని నమ్మించి.. ఇంటికెళ్లి చోరీలు.. హైదరాబాద్‌లో ముఠాగుట్టు రట్టు
Megaverse | మెగావర్స్లోకి మరో స్టార్ జంట.. చిరంజీవి షోలో సందడికి సిద్ధమైన సూర్య, జ్యోతిక..!
Mitchell Santner: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు కివీస్ బౌలర్ సాంట్నర్ దూరం
Mirnalini Ravi | మలేషియాలో ఘనంగా వరుణ్ తేజ్ హీరోయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడెవరో తెలుసా?
Encephalitis | పిల్లల్లో మెదడువాపు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

