Megaverse | మెగావర్స్లోకి మరో స్టార్ జంట.. చిరంజీవి షోలో సందడికి సిద్ధమైన సూర్య, జ్యోతిక..!
Megaverse | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఓటీటీ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. వెండితెరపై దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఇప్పుడు తొలిసారిగా హోస్ట్‌గా అవతారమెత్తి 'మెగావర్స్' అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Megaverse | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఓటీటీ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. వెండితెరపై దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఇప్పుడు తొలిసారిగా హోస్ట్‌గా అవతారమెత్తి ‘మెగావర్స్’ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా, పలువురు సినీ ప్రముఖులతో ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. తాజాగా ఈ షోలో మరో స్టార్ జంట పాల్గొనబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘మెగావర్స్’ టాక్ షోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి ఎవరు అతిథులుగా వస్తారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, నటీనటులు ఈ షోలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ఆయన భార్య, ప్రముఖ నటి జ్యోతిక కూడా ఈ షోలో సందడి చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్య, జ్యోతికలపై ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై షో నిర్వాహకుల నుంచి కానీ, సూర్య, జ్యోతిక నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మెగాస్టార్ చిరంజీవి, సూర్య, జ్యోతిక ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
సూర్య, జ్యోతిక జంటకు దక్షిణాదిలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇద్దరూ సినిమాల్లో స్టార్డమ్ సంపాదించుకోవడమే కాకుండా, నిజ జీవితంలోనూ ఆదర్శ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి చిరంజీవి టాక్ షోలో పాల్గొంటే వారి సినీ ప్రయాణం, ప్రేమ, వివాహం, కుటుంబ జీవితం వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే చిరంజీవితో సూర్యకు ఉన్న అనుబంధం, సినిమా రంగంలో ఎదురైన అనుభవాలు, ప్రస్తుత సినీ పరిశ్రమలో వస్తున్న మార్పుల గురించి కూడా ఆసక్తికరమైన సంభాషణలు జరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.కాగా,చిరంజీవి కెరీర్లో ‘మెగావర్స్’ టాక్ షో ఒక ప్రత్యేకమైన ప్రయోగం కానుంది. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు హోస్ట్‌గా సెలబ్రిటీలతో సరదా సంభాషణలు చేయబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుండటంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megaverse | మెగావర్స్లోకి మరో స్టార్ జంట.. చిరంజీవి షోలో సందడికి సిద్ధమైన సూర్య, జ్యోతిక..!
Mitchell Santner: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు కివీస్ బౌలర్ సాంట్నర్ దూరం
Mirnalini Ravi | మలేషియాలో ఘనంగా వరుణ్ తేజ్ హీరోయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడెవరో తెలుసా?
Encephalitis | పిల్లల్లో మెదడువాపు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

