Mitchell Santner: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు కివీస్ బౌలర్ సాంట్నర్ దూరం
Mitchell Santner: భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు .. కివీస్ బౌలర్ సాంట్నర్ దూరం అయ్యాడు. అతని కుడి చేయికి ఫ్రాక్చర్ అయ్యింది. అయిదో వన్డేలో అతను గాయపడ్డ విషయం తెలిసిందే. ఒకవేళ అతను కోలుకుంటే ఆసీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, కెప్టెన్ మిచెల్ సాంటర్న్ గాయపడ్డాడు. అతని కుడి చేయికి ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో గురువారం నుంచి భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అతను దూరంకానున్నాడు. మౌంట్ మంగనుయిలో జరిగిన అయిదో వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సయమంలో సాంట్నర్ గాయపడ్డాడు. అర్షదీప్ సింగ్ వేసిన బౌన్సర్ సాంట్నర్ చేయికి తగిలింది. అయితే సాంట్నర్ స్థానంలో మరో ఆల్ రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్ను తీసుకున్నారు. సాంట్నర్ కుడి చేయికి ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్‌లో తేలిందని కివీస్ క్రికెట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా సాంట్నర్ అందుబాటులో ఉంటాడో లేదో తర్వాత వెల్లడించనున్నారు. బేసిన్ రిజర్వ్‌లో జరిగే తొలి టెస్టుకు స్పిన్ బౌలింగ్ పాత్రను గ్లెన్ ఫిలిప్స్ పోషించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫాక్స్‌క్రాఫ్ట్ ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో జరిగిన మ్యాచ్‌లో అతను పాల్గొన్ననాడు. ఈ మ్యాచ్‌లో అతను 98 రన్స్ చేశాడు. డిసెంబర్ 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఆ సమయానికి సాంట్నర్ ఫిట్ నెస్‌ను మరోసారి పరీక్షిస్తారు.
కివీస్ జట్టు: టామ్ లాథమ్, టామ్ బ్లండెల్, డేవాన్ కాన్వే, హెన్రీ నికోలస్, విల్ యంగ్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, కేలీ జేమీసన్, బ్లెయిర్ టిక్నర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mitchell Santner: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు కివీస్ బౌలర్ సాంట్నర్ దూరం
Mirnalini Ravi | మలేషియాలో ఘనంగా వరుణ్ తేజ్ హీరోయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడెవరో తెలుసా?
Encephalitis | పిల్లల్లో మెదడువాపు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
Study in USA | ట్రంప్ దెబ్బతో అమెరికా చదువులకు బైబై.. యూరప్‌కు వరుస కట్టిన విదేశీ విద్యార్థులు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

