Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో నామినేషన్ల ప్రక్రియ మరోసారి హీటెక్కింది. సాధారణంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు నామినేషన్లు వేస్తుంటారు. కానీ ఈసారి బిగ్ బాస్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతోనే నామినేషన్ల ప్రక్రియను నిర్వహించారు.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో నామినేషన్ల ప్రక్రియ మరోసారి హీటెక్కింది. సాధారణంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు నామినేషన్లు వేస్తుంటారు. కానీ ఈసారి బిగ్ బాస్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతోనే నామినేషన్ల ప్రక్రియను నిర్వహించారు. ఒక్కొక్కరుగా మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తమకు నచ్చని కంటెస్టెంట్‌ను నామినేట్ చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలో హౌస్‌లో వాదనలు, ఆరోపణలు, సెటైర్లతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ముందుగా షాలిని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ నీతూని నామినేట్ చేసింది. నీతూకు ఫిజికల్ టాస్కులు ఆడే సామర్థ్యం లేదని, అలాంటి టాస్కుల విషయంలో ఆమె వెనుకబడిపోతుందని ఆరోపించింది. ఈ కారణాలతోనే నీతూని నామినేట్ చేస్తున్నట్లు షాలిని స్పష్టం చేసింది.
ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్ తన నామినేషన్‌తో పెద్ద రచ్చే చేశాడు. గతంలో హౌస్ నుంచి రూ.15 లక్షలు తీసుకుని బయటకు వెళ్లిన మిథిలేష్.. ఈసారి ముకేశ్ గౌడను టార్గెట్ చేశాడు. కేవలం నామినేట్ చేయడమే కాకుండా, ముకేశ్‌పై వరుస ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు. ముకేశ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ను కూడా పక్కన పెట్టి రోహిత్‌తో డీల్ పెట్టుకున్నాడని మిథిలేష్ ఆరోపించాడు. ఝాన్సీని సేవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ తన స్వార్థం కోసం ఆ పని చేయలేదని విమర్శించాడు. అంతేకాకుండా వర్షిణిని కాపాడటం కోసం ఝాన్సీని బలి చేశాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
మిథిలేష్ చేసిన ఈ ఆరోపణలతో ముకేశ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య కొంతసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. మిథిలేష్ సంధించిన ప్రశ్నలకు ముకేశ్ తనదైన శైలిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఈ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మిథిలేష్ తర్వాత హౌస్‌లోకి వచ్చిన దక్షి కూడా నీతూనే నామినేట్ చేసింది. దీంతో నీతూ వరుసగా మాజీ కంటెస్టెంట్ల నుంచి నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియలో నీతూని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ నామినేషన్ల ఎపిసోడ్లో అందరి దృష్టిని ఆకర్షించినది అపూర్వ ఎంట్రీ. తనదైన స్టైల్లో హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. వర్షిణిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను ఇప్పుడు నామినేట్ చేయబోయే వ్యక్తి హౌస్‌లో గత 10 వారాలుగా తేరగా తింటూ, ఎలాంటి పని చేయకుండా కూర్చుంటోందని అపూర్వ విమర్శించింది. ఫిజికల్ టాస్కులు అంటే భయపడుతుందని, వాటిని ఆడటానికి ముందుకు రావడం లేదని ఆరోపించింది. అంతేకాకుండా బి అండ్ పి అంటూ మాట్లాడే వ్యక్తి ఎవరో కాదు వర్షిణి అంటూ నేరుగా ఆమె పేరును ప్రకటించింది. దీంతో అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం మొదలైంది. దాదాపు 10 నిమిషాల పాటు వర్షిణికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అపూర్వ తన విమర్శలను కొనసాగించింది. వర్షిణి ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
వర్షిణిని విమర్శించే క్రమంలో అపూర్వ ముకేశ్‌ను కూడా వదల్లేదు. బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో అని, అలాంటి వేదికపై బి అండ్ పి వంటి పదాలు ఉపయోగించడం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలతో ముకేశ్ ఆటతీరుపైనా మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటికే మిథిలేష్ ప్రశ్నలతో ఇబ్బందిపడిన ముకేశ్‌కు అపూర్వ వ్యాఖ్యలు కూడా మరో షాక్‌లా మారాయి. ఇక చివరగా హౌస్‌లోకి వచ్చిన ఝాన్సీ తన నామినేషన్‌ను ప్రకటించింది. ఆమె దేబ్జానీని నామినేట్ చేసింది. ఇలా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లందరూ ఒక్కొక్కరుగా హౌస్‌లోకి వచ్చి తమ నిర్ణయాలను వెల్లడించడంతో నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
Study in USA | ట్రంప్ దెబ్బతో అమెరికా చదువులకు బైబై.. యూరప్‌కు వరుస కట్టిన విదేశీ విద్యార్థులు
Local Body Elections | ఎన్నికల జాప్యంతో కేంద్రం షాక్.. తెలంగాణకు రావాల్సిన రూ.1,700 కోట్లు పెండింగ్
Farmer | మంత్రి వివేక్ ఇలాకాలో రైతు ఆత్మహత్యాయత్నం
Per Capita Income | తలసరి ఆదాయంలో తెలంగాణ దూకుడు.. 8వ స్థానం నుంచి రెండో స్థానానికి!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

