Mirnalini Ravi | మలేషియాలో ఘనంగా వరుణ్ తేజ్ హీరోయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడెవరో తెలుసా?
Mirnalini Ravi | టాలీవుడ్, కోలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాళిని రవి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ అందాల భామ తాజాగా పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. మలేషియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్త మహా విష్ణును ఆమె వివాహం చేసుకుంది.
Mirnalini Ravi | టాలీవుడ్, కోలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాళిని రవి తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ అందాల భామ తాజాగా పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. మలేషియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్త మహా విష్ణును ఆమె వివాహం చేసుకుంది. నవంబర్ 15న మలేషియాలోని అందమైన లంకావి దీవిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మృణాళిని రవి మొదట సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టిక్‌టాక్ వీడియోలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. విజయ్ సేతుపతి నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో ‘ఎంజీఆర్ మగన్’, ‘ఎనిమీ’, ‘కోబ్రా’, ‘రోమియో’, ‘ఛాంపియన్’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాకుండా తెలుగు సినిమాల్లోనూ మృణాళిని రవి తనదైన ముద్ర వేసింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘మామా మశ్చీంద్ర’ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తన అందం, నటనతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇటీవల ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.
మృణాళిని రవి తన ప్రేమ విషయాన్ని ఈ ఏడాది ఆగస్టులో అభిమానులతో పంచుకుంది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక వక్త మహా విష్ణుతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ప్రేమను అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నవంబర్ 15న మలేషియాలోని లంకావి దీవిలో మృణాళిని, మహా విష్ణు వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది. విదేశీ గడ్డపై అందమైన లొకేషన్లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఫోటోలను మృణాళిని సోషల్ మీడియాలో పంచుకుంది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమికులుగా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు భార్యాభర్తల బంధంగా మారడంతో మృణాళిని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mirnalini Ravi | మలేషియాలో ఘనంగా వరుణ్ తేజ్ హీరోయిన్ డెస్టినేషన్ వెడ్డింగ్.. వరుడెవరో తెలుసా?
Encephalitis | పిల్లల్లో మెదడువాపు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
Study in USA | ట్రంప్ దెబ్బతో అమెరికా చదువులకు బైబై.. యూరప్‌కు వరుస కట్టిన విదేశీ విద్యార్థులు
Local Body Elections | ఎన్నికల జాప్యంతో కేంద్రం షాక్.. తెలంగాణకు రావాల్సిన రూ.1,700 కోట్లు పెండింగ్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

