Free Ticket | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మిగతా సూపర్ లగ్జరీ, డీలక్స్, లహరి వంటి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం లేదు.
ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఆధార్ కార్డు చూపించిన మహిళా ప్రయాణికులకు ఉచితంగా టికెట్ అందజేస్తున్నారు. అయితే డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వాలని బస్సు ముందు కూర్చొని ఓ మహిళా ప్రయాణికురాలు రోదించింది. మణుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న డీలక్స్ బస్సులో కొత్తగూడెం వద్ద ఎక్కి ఫ్రీ టికెట్ ఇవ్వాలని కండక్టర్‌తో సదరు మహిళ వాగ్వాదానికి దిగింది. బస్సుకు అడ్డంగా కూర్చున్న మహిళకు పోలీసులు నచ్చజెప్పి పంపించేశారు.
మహిళా ప్రయాణికురాలు బస్సుకు అడ్డంగా కూర్చోవడంతో.. కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలువురు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళ తీరు పట్ల పలువురు ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వాలని బస్సు ముందు కూర్చొని మహిళ హల్ చల్
మణుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న డీలక్స్ బస్సులో కొత్తగూడెం వద్ద ఎక్కి ఫ్రీ టికెట్ ఇవ్వాలని వాగ్వాదానికి దిగిన మహిళ
బస్సుకు అడ్డంగా కూర్చున్న మహిళకు నచ్చజెప్పి పంపించేసిన పోలీసులు pic.twitter.com/aKDiXTt7tG
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2025