ములుగు: ములుగు జిల్లాలోని (Mulugu) బీరమయ్య గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఓ మహిళ మృతిచెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితులకు సంబంధించిన వివారలు తెలియాల్సి ఉన్నది.