బజార్హత్నూర్, డిసెంబర్ 14 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్రా గ్రామానికి చెందిన గిరిజన మహిళ హర్క భీంబాయి(50)పై చిరుత పులి దాడి చేసిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. ఎఫ్ఎస్వో వివరాల ప్రకారం.. భీంబాయి ఉదయం ఐదు గంటలకు గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లగా పొదల్లో నుంచి ఒక్కసారిగా చిరుత పులి వచ్చి దాడిచేసింది. దీంతో ఆమె ముఖం కుడి భాగంలో గాయాలయ్యాయి. గ్రామస్తులు రిమ్స్‌కు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఫారెస్టు అధికారులు వెల్లడించారు. మహిళ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ పీసీసీఎఫ్ డోబ్రియాల్తో ఫోన్లో ఆరాతీశారు.
ఆళ్లపల్లి, డిసెంబర్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగులో శనివారం తెల్లవారుజామున పులి గాండ్రింపులు వినిపించినట్టు గ్రామస్తులు పేర్కొన్నారు. దొంగతోగు గ్రామానికి కిన్నెరసాని అభయారణ్యం దగ్గరగా ఉంటుంది.