భువనగిరి అర్బన్, ఆగస్టు 6: రైలులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురు టి నొప్పులు రాగా, భువనగిరి స్టేషన్లోనే ఆపి రైలులోనే ప్రసవం చేశారు. వివరాల్లోకి వెళ్తే… హీనా కటోన్ తన అన్నతో కలిసి మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాట్నాకు బయల్దేరింది. భువనగిరి స్టేషన్‌కు వచ్చే సరికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. రైల్వే టీసీ భువనగిరి స్టేషన్ మాస్టర్‌కు సమాచా రం అందించగా, ఆయన 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. ఈఎంటీ విష్ణుమోహన్‌రెడ్డి, పైలెట్ మహేశ్ అక్కడికి చేరుకొని రైలులోనే ప్రసవం చేశారు. హీనా కాటున్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్‌లోనే భువనగిరి జిల్లా దవాఖానకు తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.