కేసీఆర్ పాలనే బాగుండే.. ప్రస్తుతం అరిగోస పడుతున్నం
‘అయ్యా.. కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు అరిగోస పడుతున్నం. నెలదాటినా వడ్లు కొంటలేరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎదుట కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తికి చెందిన మహిళా రైతు గోలి రాధ ఆవేదన వెలిబుచ్చింది.
- నెలదాటినా వడ్లు కొంటలేరు
- మీరే మాకు పెద్ద దిక్కు.. న్యాయం చేయాలని మాజీ మంత్రి గంగుల ఎదుట మహిళా రైతు వేడుకోలు
- ధాన్యం తూకం వేయించిన గంగుల
కరీంనగర్ రూరల్, మే 27 : ‘అయ్యా.. కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు అరిగోస పడుతున్నం. నెలదాటినా వడ్లు కొంటలేరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎదుట కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తికి చెందిన మహిళా రైతు గోలి రాధ ఆవేదన వెలిబుచ్చింది. గంగుల కమలాకర్ బుధవారం కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, చేగుర్తి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. చేగుర్తిలో ధాన్యం పరిశీలిస్తున్న సమయంలో మహిళా రైతు ఎమ్మెల్యే కాళ్లపై పడే ప్రయత్నం చేసింది. ‘అయ్యా మీరు.. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బా గుండే. ఇప్పుడు మేం అరిగోస పడుతున్నం. అప్పుడు రైతు బంధు వచ్చేది.
యూరియా దొరికేది. సెంటర్కు ధాన్యం తెస్తే నాలుగు రోజుల్లో కొన్నరు. ఇప్పుడు నాకున్న రెండు ఎకరాలు వరి సాగు చేసేందుకు అప్పులు చేసి, పంట సాగు చేసిన. సెంటర్కు ధాన్యం తెచ్చి న్లైంది. ఈ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొంటలేదు. నిన్న అకాల వర్షం వచ్చి వడ్లు మొత్తం తడిసిపోయినయి. ఈ ధాన్యం గింజల మీద వచ్చే ఆదాయమే నాకు దిక్కు. చేసిన అప్పులు కట్టడానికి ఇంకో దారి లేదు. తడిసిన ధాన్యం తీసుకోమంటున్నరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ ఆమె గంగుల ఎదుట కంటతడి పె ట్టింది. రాధ పరిస్థితిని విని గంగుల కమలాకర్ చలించిపోయారు. ‘నేను నీ ధ్యానం కొనే వరకు ఇక్కడే ఉంట’ అని భరోసా ఇచ్చారు. వెంటనే నిర్వాహకులతో మాట్లాడి, హమాలీలను పిలిపించి బస్తాకు 42 కిలోల కంటే ఎక్కువ పెట్టకుండా తూకం వేయించారు. దీంతో రాధ గంగులకు కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

