నిర్మల్: నిర్మల్ జిల్లాలోని భైంసా (Bhainsa) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కమోల్లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి మహిళ మృతిచెందింది. రాత్రి వేళ ఇంట్లో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అందులో ఉన్న ద్రుపద బాయి అనే మహిళ సజీవదహనమైంది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
