శంకరపట్నం, డిసెంబర్ 31 : కోతుల గుంపు తరమడంతో భయపడిన ఓ మహిళ కిందపడి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసీరెడ్డి విమల (53) మంగళవారం ఉదయం ఇంట్లో పనులు ముగించుకుని శివారులోని వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు బయటకు రాగా ఒక్కసారిగా కోతుల గుంపు మహిళ వైపు రాగా, భయపడి కిందపడిపోయింది.
తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. విమల భర్త తిరుపతిరెడ్డి గతంలోనే అనారోగ్యంతో మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.