‘ఎప్పట్లెక్క నీళ్లస్తయని ఉన్న కొద్దిపాటి భూమిల వరి ఏసినం.. నీళ్లు లేక పంట ఎండిపోయి పెట్టుబడి మునిగినం. అప్పులు మీదవడ్డయ్. ఎట్ల బతుకుడు సారూ’ అంటూ భువనగిరి మండలం వడపర్తిలో రైతు జిన్న మణెమ్మ గుండెలు బాదుకున్నది.
ఎండిన పంటలను పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి శనివారం తమ పంట పొలాల వద్దకు రాగా ఆయన ఎదుట తన గోడు చెప్పుకుంటూ కంటికి ధారగా ఏడ్చింది.