జీవో 111 సడలింపుపై అధ్యయనం
జీవో 111లోని నిబంధనల సడలింపుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆ జీవోలోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ జీవోపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
- నివేదిక అందేవరకు షరతులన్నీ అమలు
- హైకోర్టుకు వివరించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): జీవో 111లోని నిబంధనల సడలింపుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను సమర్పించే వరకు ఆ జీవోలోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ జీవోపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు వాదన వినిపిస్తూ.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిసరాల్లో కాలుష్య కారక పరిశ్రమలు, హోటళ్లు, కాలనీలను ఏర్పాటు చేయరాదంటూ 1996లో ప్రభుత్వం 111 జీవో ఇచ్చిందని , దీని పరిధిలో 84 గ్రామాలున్నాయని చెప్పారు. ఈ జీవోలోని కొన్ని నిబంధనలను సడలించామని, దీనిపై అధ్యయన కమిటీ చేసే సిఫార్సులను పరిశీలించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అధ్యయన నివేదిక నిమిత్తం ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- GO 111
- High court
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

