ఉప్పరపల్లిలో చేతబడి కలకలం
క్రైం న్యూస్ | జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి చేస్తున్నారనే విషయం కలకలం రేపింది.

వరంగల్ రూరల్ : జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి చేస్తున్నారనే విషయం కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు..గ్రామంలో ఎప్పటి లాగే అరుబయట మంచంలో పడుకున్న చీమల సతీష్ అనే వ్యక్తి ఉదయం లేచి చూసేసరికి కనపడలేదు. చుట్టు పక్కల వెతకగా పడుకున్న వ్యక్తి మంచం పక్కన చేతబడి చేసి ఉండడం చూసి ఒక్కసారిగా గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సతీష్ పడుకున్న మంచం పక్కన మనిషి బొమ్మ , ముగ్గు గీసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు వేసి చేతబడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.
సతీష్ పడుకున్న మంచంలో అతని సెల్ ఫోన్ అలాగే ఉంది. సతీష్ మాత్రం కనిపించడం లేదు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాత్రి వాళ్లెవరు ఇంట్లో లేరు. భార్య, తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు.
గతంలో ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యమైనా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఇవి కూడా చదవండి..
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్‌గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
ఆనంద్‌తో చెస్ ఆడనున్న ఆమిర్ ఖాన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

