నల్లగొండ, అక్టోబర్ 13: నల్లగొండ జిల్లాలోని మునుగోడులో వైన్స్‌ల కోసం టెండర్లు వేసేవారికి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఝలక్ ఇచ్చారు. టెండర్లు వేసి షాపులు దక్కించుకునే వారు ఇక నుంచి ఊరి బయటే వైన్స్‌లు ఏర్పాటు చేయాలని, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకే విక్రయించాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. స్థ్దానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచనల పేరుతో రూపొందించిన వినతిపత్రాన్ని జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్‌కు అందజేశారు. ఈ నిబంధనలు పాటించే వారు మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో వైన్స్‌ల కోసం టెండర్లు వేయాలని సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతోపాటు బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళల సాధికారత, యువత మద్యం పట్ల బానిసలు కాకూడదనే ఆలోచనతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో పల్లె వెంకన్న, కత్తి రవీందర్‌రెడ్డి, పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, రఘుపతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, దోటి వెంకటేశ్, చంద్రశేఖర్, సత్యం తదితరులు ఉన్నారు.
ఇవీ నిబంధనలు..