Wife killed husband | కామారెడ్డి జిల్లాలో దారుణం.. మామతో కలిసి భర్తను చంపిన భార్య
Wife killed husband | కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను(Husband ) భార్య మామతో కలిసి హతమార్చిన(Wife killed) సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ : కట్టుకున్న భర్తను(Wife killed) మామతో కలిసి హత్యచేసి గుంతలో పూడ్చిపెట్టిన ఘటన కామారెడ్డి((Kamareddy) జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్‌కు చెందిన రాములు (33) జులాయిగా తిరుగుతుండేవాడు. తాగి వచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణను కొడుతూ హింసించేవాడు.
దీంతో విసిగిపోయిన వారిద్దరు కలిసి ఈ నెల 9న రాములును హత్య చేశారు. మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో ఉంచారు. అనంతరం ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. గత పది రోజులుగా రాములు కనిపించకపోవడం.. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో తవ్విన గుంత అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిద్దరిని నిలదీశారు.
దీంతో నిందితులిద్దరూ రాములును హత్య చేసినట్లు చెప్పడంతో శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాన్సువాడ పోలీసులు ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని గుంతను తవ్వగా మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

