సంగారెడ్డి : వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది(Killing husband). ప్రియుడు సహా మరో ముగ్గురితో కలసి భర్తను హత్య చేయించింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..మూడురోజుల క్రితం తన భర్త అదృశ్యం అయ్యాడని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర మండలం పల్పానూర్ గ్రామ శివారులో మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు కామారెడ్డి జిల్లా బిక్కు నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మాలే నారాయణ (45) గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | రేవంత్ ఏడాది పాలనలో 12 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు : కేటీఆర్
KTR | రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని.. గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇద్దాం : కేటీఆర్
KTR | ఆ సినిమాలోని కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ మాదిరి.. రేవంత్ రెడ్డి పాలన : కేటీఆర్