కేసీఆర్ నీటిబొట్టంత కాదని నిన్న ఎవడో మాట్లాడాడు. నీటిబొట్టే అయితే ఎందుకంత భయపడుతున్నరు? అలాంటప్పుడు నీటిబొట్టులాంటి కేసీఆర్‌ను నిందించే అక్కరేమున్నది? నాకర్థం కాదు. ఎవరనుకున్నరండీ?! నీలం సంజీవరెడ్డి పుట్టంగనే రాష్ట్రపతి అవుతారని అనుకున్నరా? నేను పుట్టంగనే మా అమ్మ నాన్నా అనుకున్నరా? రాష్ట్రం ఏర్పడుతదని, నేను ముఖ్యమంత్రిని అయితననని. ప్రాసెస్‌లో పనిచేస్తా ఉంటే ప్రజలు గుర్తిస్తే, అవకాశం ఇస్తే.. పని చేస్తరు. ఇప్పుడు కూడా ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎవరనుకుంటరు? మల్లారెడ్డి పాలు అమ్ముకున్నడు.. కష్టపడి పైకివచ్చిండు.. మంత్రి అయితడని అనుకున్నరా? మోదీ ఆయనే చెప్పిండు గదా. రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకున్న అని. ఆయన కాలేదా ప్రధానమంత్రి. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. నిజాయితీగా పని చేస్తే అవకాశాలు వస్తయి. చాలా విషయాలు మన కండ్ల ముందే జరిగినయి. సినిమా యాక్టర్లు ఎంజీఆర్, ఎన్టీఆర్ సీఎంలు అయిండ్రు కదా.