హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తేతెలంగాణ): ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్, వన్ రేషన్- వన్ ఎలక్షన్- వన్ మార్కెట్’ అంటూ ఊదరగొడుతున్న కేంద్రం పత్తి కొనుగోళ్లలో వన్ నేషన్-వన్ ఎమ్మెస్పీ పాటించడంలేదేందుకని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో పత్తికి క్వింటాల్‌కు రూ.8,257 మద్దతు ధర ఇస్తుండగా, తెలంగాణలో పత్తికి రూ. 7,521 ఇవ్వడంలో అంతర్యమేంటి? ఎందుకు ఈ వ్యత్యాసం? అంటూ గురువారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఇప్పటికైనా రైతులపై వివక్షను చూపడంమానీ అన్ని రాష్ట్రాల్లో పత్తికి ఒకే విధమైన మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.