హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): సామాజిక కార్యకర్త సారా మాథ్యూస్‌కు సీఎం రేవంత్ సన్నిహితురాలిగా పేరుంది. అలాంటి ఆమె నిజామాబాద్ రౌడీషీటర్ రియాజ్‌ది లాకప్‌డెత్ అని నిర్ధారించారు. ఓ రాజకీయ నాయకుడి నకిలీనోట్ల కుంభకోణాన్ని దాచిపెట్టేందుకే ఈ హత్య జరిగిందని, 3 లక్షల విలువైన నకిలీనోట్లు చేతులు మా రినట్టు ఆమె నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీ నిర్ధారించింది.
పోలీసు కస్టడీలో ఉన్న రియాజ్ చనిపోయాక, అతడిని దవాఖానకు తీసుకెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు కట్టుకథ అల్లారని కమిటీ భావిస్తున్నది. రియాజ్‌ను వెతికే ప్రక్రియలో ఆయన భార్య, తల్లిపై లైంగికదాడి చేశారని ఆరోపించింది. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద నేర సంఘటన అని, నకిలీ నోట్లు, లాకప్‌డెత్, లైంగికదాడి వంటి తీవ్ర ఆరోపణ లు ఉన్న ఈ ఘటనపై రేవంత్ఎందుకు నోరు విప్పడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.