కిషన్‌రెడ్డి యాత్రకు రాజాసింగ్ డుమ్మా!
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ కార్యక్రమానికి మళ్లీ డుమ్మా కొట్టారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మంగళవారం గోషామహల్లో నిర్వహించిన విజయ సంకల్ప రథయాత్రకూ ఆయన హాజరుకాలేదు. ఈ విషయంలో ఆ పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ కార్యక్రమానికి మళ్లీ డుమ్మా కొట్టారు. కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మంగళవారం గోషామహల్లో నిర్వహించిన విజయ సంకల్ప రథయాత్రకూ ఆయన హాజరుకాలేదు. ఈ విషయంలో ఆ పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతున్నది. వాస్తవానికి యాత్రకు మొదటి నుంచీ రాజాసింగ్ దూరంగానే ఉంటున్నారు.
ఇప్పుడు ఏకంగా కిషన్‌రెడ్డి ర్యాలీకి డుమ్మా కొట్టడంతో రాష్ట్ర నాయకత్వానికి, రాజాసింగ్‌కు మధ్య పూడ్చలేనంత దూరం పెరిగిందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉండగా విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినప్పటి నుంచే మనస్థాపం చెందినట్టు చెప్తున్నారు. వరుసగా మూడోసారీ ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం. బీజేఎల్పీ నేతగా మహేశ్వర్‌రెడ్డిని నియమించడం, ఎల్పీలో ఎలాంటి పదవీ అప్పగించకపోవడంతో తీవ్రంగా మనస్థాపం చెందినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపీ టికెట్ అడిగితే పార్టీ ససేమిరా అనడంతో కూడా ఆయన అలిగినట్టు చెప్తున్నారు. దీంతో ఆ పార్టీ కార్యక్రమాలకు దాదాపుగా దూరం అయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

