హైదరాబాద్ (ఖైరతాబాద్), అక్టోబర్ 10: విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ మాదిరిగా ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రారంభించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 640 మంది పిల్లలకు ఏడు నుంచి పది ఎకరాల భూమి కేటాయిస్తే ప్రస్తు త ప్రభుత్వం 2560 మంది విద్యార్ధులకు కేవలం 25 ఎకరాలు మాత్రమే కేటాయిస్తుందని, అది దేనికి సరిపోతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వి జయ్ ఆర్యన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలతో విద్యార్థులకు ఒరిగేదేమీ లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, లెక్చరర్స్ జేఏసీ అధ్యక్షుడు మధుసూదన్, నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు సైదులు, అడ్వకేట్స్ అ సోసియేషన్ అధ్యక్షుడు వంశీకృష్ణ, అంజి, రా ఘవేందర్, నందగోపాల్ పాల్గొన్నారు.