హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో అత్యున్నత విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఐఐటీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అదరగొట్టాయి. ఈ సారి ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్‌లకు చెందిన విద్యార్థులు అత్యధిక ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ విద్యార్థికి రూ. 4.3 కోట్ల వార్షికవేతన ప్యా కేజీ లభించింది. ఐఐటీల్లో ప్లేస్‌మెంట్స్ సీజన్‌గా ఏటా డిసెంబర్‌ను పరిగణిస్తారు. గూగుల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మెన్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, న్యూటానిక్స్, బ్లాక్‌రాక్ వంటి కంపెనీలు ఈ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. కొన్ని ఐఐటీల్లో డిసెంబర్ 15, మరికొన్నింటిలో నెలాఖరు వరకు ఈ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ కొనసాగనున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బ్రహ్మోత్సవాల లోపు యా దాద్రి విమాన గోపురం పనులు పూర్తి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొం డా సురేఖ తెలిపారు. దేశంలోనే ఎత్తయి న స్వర్ణగోపురంగా యాదాద్రి దేవాల యం ఖ్యాతి చెందనుందని పేర్కొన్నారు.