Bandla Ganesh : ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్‌రాజ్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై ఆయన స్పందించారు. పవన్ కల్యాణ్ ఇటీవల జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని ప్రకటించారు. దీనిపై ప్రకాశ్‌రాజ్.. ఎక్కడా పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకుండానే ఆయనను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీరొస్తానంటె మేమొద్దంటామా..? రండి దొర.. కానీ వచ్చే ముందు.. ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేదంటే సింగిల్‌గా వస్తున్నారా..? అది చెప్పి రండి’ అని ప్రకాశ్‌రాజ్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ పోస్టుతో పవన్‌కల్యాణ్ కంటే ముందుగా బండ్ల గణేష్‌కు సురుకు అంటుకుంది. అందుకే ప్రకాశ్‌రాజ్‌పై ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘నీకెందుకు ప్రతి దాంట్లో వేలుపెట్టడం..? అసలు నువ్వెవడివి..? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా..? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి..? ప్రతి ఊర్లో, ప్రతి అంశంలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా..? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. పని లేకపోతే చూసుకో. కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్’ అంటూ ‘ఎక్స్’ వేదికగానే మండిపడ్డారు.