హైదరాబాద్, జనవరి13 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో ఎక్స్టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ హోదాల్లో కొనసాగుతున్న అధికారులను వెంటనే తొలగించాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు విజ్ఞప్తి చేశారు.
జలసౌధకు వచ్చిన మంత్రికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇరిగేషన్‌శాఖలో వివిధ క్యాడర్లలో పలువురు ఇంజినీర్లు ఎక్స్‌టెన్షన్‌పై పనిచేస్తున్నారని తద్వారా ప్రమోషన్లకు అవకాశం లేకుండా పోతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.