అమీన్పూర్, సెప్టెంబర్ 3: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ తండా పంచాయతీ పరిధిలో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ కూల్చివేతలు చేపట్టారు. కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో అక్రమ కట్టడాలతోపాటు సర్వే నంబర్ 462ని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన కట్టడాలను తహసీల్దార్ రాధా ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. మంగళవారం తెల్లవారుజామున రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీస్ బలగాలతో వచ్చి కూల్చివేతలు చేపట్టారు. 462 సర్వే నంబర్లో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డికి సంబంధించిన నిర్మాణాలను కూలుస్తున్నట్టు సమాచారం అందుకొన్న కార్యకర్తలు, అనుచరులు అక్కడికి చేరుకొని రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పూర్తిస్థాయి సర్వే నిర్వహించిన తరువాతే కూల్చివేతలు చేపట్టాలని చైర్మన్ పాండురంగారెడ్డి ఆందోళనకు దిగారు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అంటూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అదే సర్వే నంబర్లో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ న్కూల్కు సంబంధించిన ప్లేగ్రౌండ్తోపాటు ప్రహరిని ధ్వంసం చేశారు.
అమీన్పూర్లో అధికారులు నియంతగా వ్యవహరిస్తున్నారు. న్యాయస్థానాలను సైతం లెక్కచేయడం లేదు. ఇటువంటి కక్షసాధింపు చర్యలు ఉంటాయని, గుర్తించి అధికార కాంగ్రెస్లో చేరినప్పటికీ వేధింపులు తప్పడం లేదు.