హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల నగదు రహిత వైద్యానికి మోక్షమెప్పుడని రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఇంజమూరి రఘునందన్ నిలదీశారు. హెల్త్‌కేర్ ట్రస్టు ఏర్పాటు చేసి, నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగుల హెల్త్స్కీంను అమలు చేస్తున్నట్టు వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే ఈ నెల 16నే అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడిని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడం మరిచిపోయింది. దీంతో పూర్తిస్థాయిలో సెంటర్లు నిర్వహించాలా.. లేదంటే ఒంటిపూట కొనసాగించడమా అనే విషయంపై ఆయోమయం నెలకొన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టీచర్స్ సంఘాల నాయకులు కోరుతున్నారు.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 14 జిల్లాలకు డీసీసీ కమిటీలను టీపీసీసీ ప్రకటించింది. ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి పదవులతో పాటు పూర్తిస్థాయి కమిటీలను నియమించింది.