హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న కాంగ్రెస్ నేతల పోస్టుకు టీజీపీఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా స్పందించారు. ‘అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తరు? మీరు ఇచ్చిన హామీలను ఒక్కసారి గుర్తుచేసుకోండి. అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఎన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు. మీరు పదే పదే వల్లించే రోల్మాడల్ ప్రభుత్వమంటే హక్కుల సాధనకు చేస్తున్న శాంతియుత నిరసనలను అణిచివేడమేనా’? అంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.