Suryapet | చివ్వెంల, మార్చి 9: ‘కేసీఆర్ పుణ్యమా అని కాళేశ్వరం నీళ్లొస్తే ఆరేండ్లసంది భూమి కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్న. ఈ యాసంగిలో కూడా పదకొండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తే నీళ్లు రాక మొత్తం పొలమంతా ఎండిపోయింది’ అని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండ లం వల్లభాపురం గ్రామ పంచాయతీ ఆవాసం జగన్నాయక్ తండా గిరిజన రైతు బానోతు పాండు ఆవేదన వ్యక్తంచేశాడు. ‘రూ.10 లక్షల అప్పు ఉన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత యాసంగిలో నీళ్లివ్వలేదని, ఈ సీజన్లో నీళ్లురాక 11 ఎకరాలు ఎండిపోయింది. పెట్టుబడులకు సుమారు రూ.4 లక్షలు అప్పు చేసిన. పాత అప్పు రూ.10 లక్షలు కలిపి మళ్లీ రూ.14 లక్షలకు అప్పు చేరింది. మరి భూమి యజమానికి కౌలెట్ల ఇయ్యాలే, అప్పెట్ల తీర్చాలె.. అంటూ రైతు పాండు కంటనీరు పెట్టుకున్నాడు.