శంషాబాద్ రూరల్, మే 16 : ‘మట్టిపోసి .. రోడ్డువేసి .. చెరువుకు స్కెచ్’ అనే వార్త గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితం కాగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. గురువారం చెరువును పరిశీలించి, చెరువులో మట్టివేసిన వ్యక్తిచేతనే ఆ మట్టిని తొలగింపజేశారు.
ఈ సందర్భంగా శంషాబాద్ తహసీల్దార్ నాగమణి, ఇరిగేషన్ ఏఈ మౌనిక మాట్లాడుతూ శంషాబాద్ మండలం నర్కూడ రెవెన్యూ పరిధిలోని సుంతరోని చెరువులో మట్టిపోసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.