హైదరాబాద్ మే 25 (నమస్తే తెలంగాణ): నీతి ఆయోగ్ గత సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు పోజులు కొట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు వెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో వచ్చిన మార్పేంటని ఆదివారం ఎక్స్ వేదికగా నిలదీశారు.
నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో రేవంత్ పేరు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకొనేందుకే వెళ్లినట్టు భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాగా, నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియో, శనివారం ప్రధాని మోదీతో కరచాలనం చేస్తున్న ఫొటోను కేటీఆర్ ట్యాగ్ చేశారు.