Global Summit | హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది?’ అని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నది. గ్రామాల్లో ప్రజలంతా పంచాయతీ ఎన్నికల్లో బిజీ అవ్వడం వల్ల.. గ్లోబల్ సమ్మిట్ గురించి పట్టించుకోవ డం లేదని ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్ అందినట్టు తెలిసింది. ఫోర్త్‌సిటీలో జరుగుతున్న ఈ స మ్మిట్ వల్ల ఉపయోగాలేమిటో కూడా తెలుసుకునేంత ఖాళీగా జనాలు లేకపోవడంతో.. ఇన్ని కోట్ల ఖర్చు ఏమేరకు ప్రతిఫలాన్ని ఇ చ్చిందని తెలుసుకునే పనిలో ఇంటెలిజెన్స్‌ను దించారు.
దీంతో ఆయా జిల్లాల్లోని యూనిట్ ఆఫీసర్లు, ఈ క్రమంలో వారు తమ మండల పరిధిలోని ముఖ్యనాయకుల ను సమ్మిట్ విషయాలు అడుగుతున్నట్టు తెలిసింది. ఇదే విషయంపై హైదరాబాద్ ప్రజానీకం ఏమనుకుంటున్నది? అనేది తెలుసుకునేందుకు ఓ వ్యవస్థ మొత్తం సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టుల కోసం జల్లెడ పడుతున్న ట్టు తెలిసింది. ఇక గ్లోబల్ సమ్మిట్ సరిసర ప్రాంతాల్లోనూ మీడియా ప్రతినిధుల నుంచి సమ్మిట్ సక్సెస్‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. మొ దట.. ‘మీరు ఏమనుకుంటున్నారు? ఎలా జరిగింది?’ అనే ప్రశ్నల నుంచి.. ‘మీ జి ల్లా ల్లో,గ్రామాల్లో ఏమనుకుంటున్నారు? ప్రజల్లో స్పందన ఎలా ఉంది? జెన్యూన్‌గా చెప్పండి’ అంటూ మీడియా ప్రతినిధులను అడిగారు.