హైదరాబాద్, మార్చి 15 (నమస్తేతెలంగాణ) : యూట్యూబర్లు, మీడియాను నమ్ముకొని తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఇవాళ వారిపైనే ఆడ, మగ అని చూడకుండా బట్టలూడదీసి కొడ్తాం అనడం దేనికి సంకేతమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆమె మీడియాపాయింట్లో మాట్లాడుతూ.. అత్యంత గౌరవప్రదమైన చట్టసభల నుంచి ఈ రకమైన భాషను మాట్లాడుతున్న సీఎం.. తన బుద్ధి, జ్ఞానం ఇదేననే సంకేతం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. సభ్యసమాజం, బుద్ధిజీవులు, మేధావులు ఇలాంటి సీఎం గురించి ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. సీఎం దుర్భాషను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.