kancha gachibowli | హైదరాబాద్‌కు, తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఫార్ములా-ఈ రేస్‌లో లేని లొసుగులేవో ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు ఏడాదిగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఈ-రేస్‌లో అకౌంట్ నుంచి అకౌంట్‌కు నగదు బదిలీ జరిగింది. అక్రమమేమీ లేకపోయినా.. అవినీతి జరగకపోయినా హైదరాబాద్ మేలు కోసం తీసుకున్న ఓ తక్షణ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఏకంగా కేసులు పెట్టింది. మరి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల తాకట్టు వ్యవహారంలో విధానపరలోపాలు, ప్రభుత్వ తప్పిదాలు కోకొల్లలు. లెక్కకు మించిన లొసుగులు, ఉల్లంఘనలూ ఉన్నాయి. మరి వాటికి బాధ్యులెవరు? ఈ ప్రభుత్వం ఎవరిపై కేసులు పెడ్తుంది?
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : సామాన్యుడు ఒక్క నిబంధనను ఉల్లంఘించినా ప్రభుత్వ యం త్రాంగం విరుచుకుపడుతుంది! క్షణాల్లో అతడి ఆశల సౌధాన్ని నేలమట్టం చేస్తుంది! చివరికి అధికారులే బాధ్యులైనా శిక్ష సామాన్యుడికే విధిస్తుంది. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఇదే జరుగుతున్నది. ఫార్ములా-ఈ రేసులో ఒప్పందం ప్రకారమే ప్రభుత్వ అకౌంట్ నుంచి రూ.55 కోట్ల బదలాయింపు జరిగింది. ఆ మొత్తం తమకు చేరినట్టు సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ ప్రక్రియలో విధానపరమైన లోపం ఉన్నదంటూ కాంగ్రెస్ సర్కా రు ఏడాదిన్నరగా గాయిగాయి చేస్తున్నది. ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. సీఎం మొదలు మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్త వరకు ఇందులో ఏదో అవినీతి జరిగిందనే రీతిలో ప్రజల్లో భ్రమ కల్పించే దుస్సాహసానికి ఒడిగట్టారు.
మరి.. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో జరిగిందేమిటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఈ భూములు సాంకేతికంగా తమవేనంటూ ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ద్వారా ఒక సంస్థకు హక్కులను బదలాయించింది. బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్ల మొత్తాన్ని సేకరించింది. దాదాపు 9-10 నెలల పాటు సాగిన ఈ ప్రక్రియలో అడుగడుగునా ఉల్లంఘన జరిగింది.
ప్రభుత్వమే గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం ఒకవంతైతే.. అసలు భూ హక్కులు పొందకుండానే టీజీఐఐసీ ప్రైవేటు సంస్థకు హక్కులను బదలాయించడం వంటి విధానపరమైన లోపాలు వెక్కిరిస్తున్నాయి. సామాన్యులు.. ప్రతిపక్షాల విషయంలో నీతులు వల్లించే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, ఈ విధానపరమైన లోపాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు? ఎంతమందిపై కేసులు నమోదు చేస్తారు? అసలు ఎలాంటి విచారణకు ఆదేశించి లోపాలను ప్రజల ముందు ఉంచుతారు? వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములపై ‘అంతా ఫీల్‌గుడ్’ అని ప్రభుత్వం ఒక్క మాటలో తేల్చి చెప్తున్నా, రికార్డులు, జరిగిన ఒప్పందాలను లోతుగా పరిశీలిస్తే.. బాధ్యతాయుతమైన ప్రభుత్వమే ఎడాపెడా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు స్పష్టమవుతున్నది.
అసలు టీజీఐఐసీకి హక్కుల దఖలు ఎక్కడ?
ఇందులో అసలు టీజీఐఐసీకి రెవెన్యూ శాఖ నుంచి అధికారికంగా, నిబంధనల ప్రకారం హక్కు లు ఎక్కడ దఖలయ్యాయి? అనేది కీలకమైన ప్రశ్న అని అధికారులే చెప్తున్నారు. తహసీల్దార్ పంచనా మా ప్రకారం టీజీఐఐసీ 400 ఎకరాలను క్షేత్రస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నది. కానీ 571 జీవో ప్రకారం రంగారెడ్డి కలెక్టర్ ప్రొసీడింగ్‌లో పొం దుపరిచిన పలు నిబంధనలు ఇంకా అమలు కాలే దు. సాంకేతికంగా టీజీఐఐసీకి హక్కులు రానిదే బీకాన్ ట్రస్టీషిప్తో ఎలా ఒప్పందం చేసుకుంటారు? ఆ మేరకు మార్కెట్లో బాండ్ల ద్వారా నిధుల సమీకరణతో ఐసీఐసీఐ బ్యాంకులోని ఎస్క్రో అకౌంట్లోకి రూ.8 వేల కోట్ల పైచిలుకు మొత్తం ఎలా వస్తుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిషేధిత జాబితా నుంచి తొలగించారా?
ఇందులో ఏది నిజం?
సామాన్యుడికే నిబంధనలా?
ప్రభుత్వ ఉత్తర్వులకే తిలోదకాలా?
ఒకే భూమికి 8 రకాల ధరలా?
ఒక కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇంకో కలెక్టర్‌తో ఉపసంహరణా?