Kaleshwaram | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున కాశేశ్వరం ప్రాజెక్టు భద్రతకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారీ వర్షాలు, వరదల వల్ల గతంలో 60 మంది వరకు మరణించిన నేపథ్యంలో విపత్తుల నిర్వహణ చట్టం అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ 2020లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతకు చేపట్టిన చర్యలపై నివేదిక ఇవ్వాలని, ఇదే విషయమై 2023 సెప్టెంబర్ 4న హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టారో లేదో చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.